ఎస్తేరు 8:15-17
15
మొర్దెకై రాజు దగ్గర నుండి బయలుదేరినప్పుడు, అతడు నీలి తెలుపు రంగుల రాజ వస్త్రం పెద్ద బంగారు కిరీటం శ్రేష్ఠమైన ఊదా రంగు సన్నని నారతో చేయబడిన వస్త్రం ధరించాడు. షూషను పట్టణం ఎంతో ఆనందంతో సంబరపడింది.
16
యూదులకు అది సంతోషం, ఆనందం, ఉత్సాహం ఘనతగల సమయం.
17
రాజు తాకీదులు అందిన ప్రతి సంస్థానంలో, ప్రతి పట్టణంలో యూదులలో ఆనందం, ఉత్సాహం ఉంది, వారు విందు చేసుకుని సంబరపడ్డారు. ఇతర దేశాల ప్రజలు ఎంతోమంది యూదుల భయం పట్టుకుని యూదులుగా మారారు.
Settings