- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
ఎస్తేరు రాజును సమీపించుట
ఎస్తేరు 5:1-3
ఎస్తేరు రాజును సమీపించుట
1
మూడవ రోజు ఎస్తేరు తన రాజవస్త్రాలు ధరించి, రాజభవనం లోపలి ఆవరణంలో రాజు గది దగ్గర నిలబడింది. ద్వారానికి ఎదురుగా రాజు తన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు.
2
ఆవరణంలో ఎస్తేరు రాణి నిలబడి ఉండడం రాజు చూసినప్పుడు, అతనికి ఆమె పట్ల ఇష్టం కలిగి, తన చేతిలో ఉన్న బంగారు దండాన్ని ఆమె వైపు చాపాడు. ఎస్తేరు సమీపించి, ఆ దండం యొక్క అంచును ముట్టుకుంది.
3
అప్పుడు రాజు, “ఎస్తేరు రాణి, ఏంటి విషయం? నీ మనవి ఏంటి? రాజ్యంలో సగమైనా సరే, నీకు ఇవ్వబడుతుంది” అని అన్నాడు.
ఈ భాగాన్ని అధ్యయనం చేయండి
ఈ మొత్తం భాగంపై వ్యాఖ్యానం
- ఎవరు
- ఎక్కడ
- ఎప్పుడు
- About
లేఖనాల్లో ఇది ఇంకెక్కడ ఉందో
మార్కు 6:23
అతడు, “నీవు ఏది అడిగినా నేను ఇస్తాను, నా రాజ్యంలో సగం అడిగినా ఇచ్చేస్తాను!” అని ఆమెతో ఒట్టు పెట్టుకుని ప్రమాణం చేశాడు.వచనం 3 నుండిఎస్తేరు 7:2
వారు రెండవ రోజు ద్రాక్షరసం త్రాగుతుండగా రాజు మరలా, “ఎస్తేరు రాణి, నీ విన్నపం ఏంటి? అది నీకు ఇస్తాను. నీ మనవి ఏంటి? రాజ్యంలో సగమైనా సరే, నీకు ఇవ్వబడుతుంది” అని అన్నాడు.వచనం 3 నుండిఎస్తేరు 8:4
అప్పుడు రాజు తన బంగారు రాజదండం ఎస్తేరు వైపు చూపాడు, ఆమె లేచి అతని ఎదుట నిలబడింది.వచనం 2 నుండిఎస్తేరు 4:11
“రాజు పిలువకుండా పురుషుడు గాని స్త్రీ గాని రాజు యొక్క అంతఃపురం లోనికి వెళ్తే, రాజు తన బంగారు దండాన్ని వారివైపు చాపి వారిని బ్రతకనిస్తే తప్ప లేకపోతే వారు చంపబడాలి అనే ఒక చట్టం ఉందని రాజు అధికారులందరికి, రాజ్య సంస్థానాలలో ఉన్న ప్రజలందరికి తెలుసు. అయితే ముప్పై రోజులుగా నేను రాజు దగ్గరకు వెళ్లడానికి నాకు పిలుపు రాలేదు.”వచనం 1 నుండిఎస్తేరు 5:6
వారు ద్రాక్షరసం త్రాగుతున్నప్పుడు రాజు మరలా ఎస్తేరుతో, “నీ విన్నపం ఏంటి? అది నీకు ఇస్తాను. నీ మనవి ఏంటి? రాజ్యంలో సగం అడిగినా సరే నీకు ఇస్తాను” అన్నాడు.వచనం 3 నుండిఎస్తేరు 9:12
రాజు ఎస్తేరు రాణితో, “యూదులు షూషను కోటలో అయిదువందల మందిని హామాను పదిమంది కుమారులను చంపారు. రాజు యొక్క ఇతర సంస్థానాలలో ఏమి జరిగింది? ఇప్పుడు నీ మనవి ఏంటి? అది నీకు ఇస్తాను. నీ కోరిక ఏంటి? అది కూడా చేస్తాను” అన్నాడు.వచనం 3 నుండిసామెతలు 21:1
యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువ ఆయనకు ఇష్టులైన వారివైపు దాని త్రిప్పుతారు.వచనం 2 నుండిఎస్తేరు 6:4
రాజు, “ఆవరణంలో ఉన్నది ఎవరు?” అని అడిగాడు. అప్పుడే హామాను, తాను సిద్ధపరచిన ఉరికంబం మీద మొర్దెకైను ఉరితీయడం గురించి రాజుతో మాట్లాడడానికి బయట ఆవరణంలోకి ప్రవేశించాడు.వచనం 1 నుండిప్రకటన 3:21
నేను జయించి నా తండ్రితో పాటు ఆయన సింహాసనం మీద కూర్చున్నట్లే జయించినవారిని నా సింహాసనం మీద నాతో పాటు కూర్చోనిస్తాను.వచనం 1 నుండి1 పేతురు 3:3
తల వెంట్రుకలను అలంకరించుకోవడం, బంగారు ఆభరణాలను ధరించడం, విలువైన వస్త్రాలు వేసుకోవడం అనే బాహ్య సౌందర్యం వద్దు.వచనం 1 నుండి1 పేతురు 3:5
ఎలాగంటే, పూర్వకాలంలో పరిశుద్ధులైన స్త్రీలు దేవునిలో నిరీక్షణ ఉంచి ఇలా తమ సౌందర్యాన్ని పోషించుకుంటూ, తమ భర్తలకు లోబడి ఉన్నారు.వచనం 1 నుండిఎస్తేరు 4:16
“వెళ్లండి, షూషనులో ఉన్న యూదులందరిని సమకూర్చి నా కోసం ఉపవాసం ఉండమని చెప్పండి. మూడు రోజులపాటు ఏమీ తినవద్దు త్రాగవద్దు. నేను, నా సేవకులు కూడా మీరు చేసినట్లు ఉపవాసం పాటిస్తాము. ఇలా చేసిన తర్వాత నేను రాజు దగ్గరకు వెళ్తాను అది చట్టానికి విరుద్ధమైనా ఫర్వాలేదు. నేను చస్తే చస్తాను.”వచనం 1 నుండి


అధ్యయన గమనిక
Settings