కంటెంట్‌కు వెళ్లండి
ప్రసంగి 8:1-8

జ్ఞానం మరియు అధికారానికి లోబడుట

ప్రసంగి 8:1-8
1
జ్ఞానులకు ఎవరు సాటి? విషయాలను ఎవరు వివరించగలరు? ఒకని జ్ఞానం వాని ముఖాన్ని ప్రకాశవంతం చేస్తుంది దాని కఠిన రూపాన్ని మారుస్తుంది.
2
నీవు దేవుని ఎదుట ప్రమాణం చేశావు కాబట్టి రాజాజ్ఞకు లోబడమని నేను చెప్తున్నాను.
3
రాజు సముఖం నుండి తొందరపడి వెళ్లి పోవద్దు. అతడు తనకు ఏది ఇష్టమైతే అది చేస్తాడు కాబట్టి చెడ్డపనులు చేయవద్దు.
4
రాజు మాట మహోన్నతమైనది, “మీరు నీవు ఏం చేస్తున్నావు?” అని రాజును ఎవరు అడగగలరు?
5
అతని ఆజ్ఞను పాటించే వారెవరికి ఏ హాని జరగదు, ఏది సరియైన సమయమో న్యాయమో జ్ఞానుల హృదయానికి తెలుసు.
6
ఒక వ్యక్తి కష్టం అతని మీద అధిక భారంగా ఉన్నప్పటికీ, ప్రతి దానికి సరియైన సమయం విధానం ఉంది.
7
భవిష్యత్తు గురించి ఎవరికి తెలియదు కాబట్టి, ఏది రాబోతుందో ఒకరికి ఎవరు చెప్పగలరు?
8
గాలిని అదుపుచేసే శక్తి ఎవరికీ లేదు, కాబట్టి తమ మరణ సమయం మీద ఎవరికీ అధికారం లేదు. ఎలాగైతే యుద్ధ సమయంలో ఎవరూ విడుదల చేయబడరో, అలాగే దుర్మార్గం దానిని ఆచరించేవారిని విడుదల చేయదు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options