ప్రసంగి 11:9
చుట్టుపక్కల సందర్భంతో వచనం 9 చూపబడుతోంది.
6
ఉదయాన్నే మీ విత్తనాన్ని విత్తండి, సాయంత్రం వరకు మీ చేతులను వెనుకకు తీయకండి, ఎందుకంటే ఇది ఫలిస్తుందో అది ఫలిస్తుందో, లేదా రెండు సమానంగా ఫలిస్తాయో, మీకు తెలియదు.
7
వెలుగు ఆహ్లాదకరమైనది, సూర్యుని చూడడం కళ్లకు సంతోషాన్ని ఇస్తుంది.
8
ఎవరు ఎన్ని సంవత్సరాలు బ్రతికితే, అన్ని సంవత్సరాలు వారు ఆనందంగా ఉండాలి. అయితే చీకటి రోజులు చాలా రాబోతున్నాయని వారు జ్ఞాపకముంచుకోవాలి. రాబోయేదంతా అర్థరహితమే.
9
యవ్వనులారా మీరు, మీ యవ్వన దశలో మీరు సంతోషించండి, మీ యవ్వన దినాల్లో మీ హృదయాన్ని సంతోషంగా ఉండనివ్వండి మీ హృదయ కోరుకున్న వాటిని మీ కళ్లు చూసే వాటిని అనుభవించండి, కాని వీటన్నిటిని బట్టి దేవుడు మిమ్మల్ని తీర్పులోకి తెస్తారని తెలుసుకోండి.
10
కాబట్టి, మీ హృదయంలోనుండి ఆందోళన తీసివేయండి, మీ శరీర బాధలను వెళ్లగొట్టండి, ఎందుకంటే యవ్వనం, దాని బలం అర్థరహితమే.
Settings