1
పరిమళతైలంలో పడిన చచ్చిన ఈగలు దానికి చెడు వాసన తెచ్చినట్లు, కొంచెం మూర్ఖత్వం జ్ఞానాన్ని ఘనతను పాడుచేస్తుంది.
2
జ్ఞాని హృదయం కుడి చేతిలో ఉంటుంది, కాని మూర్ఖుడి హృదయం ఎడమ చేతిలో ఉంటుంది.
3
తెలివిలేనివారు దారిలో సరిగా నడవలేక వారు ఎంత తెలివితక్కువ వారు అనేది అందరికి చూపిస్తారు.