ద్వితీయోపదేశకాండము 8:1-6
1
మీరు జీవించి అభివృద్ధిచెంది, యెహోవా మీ పూర్వికులకు ప్రమాణం చేసిన దేశానికి వెళ్లి దానిని స్వాధీనం చేసుకునేలా, ఈ రోజు నేను మీకిచ్చే ప్రతి ఆజ్ఞను జాగ్రత్తగా అనుసరించాలి.
2
మీరు ఆయన ఆజ్ఞలను పాటిస్తారో లేదో అని మిమ్మల్ని పరీక్షించి మీ హృదయంలో ఏమున్నదో తెలుసుకోవడానికి మిమ్మల్ని దీనులుగా చేయడానికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అరణ్యంలో ఈ నలభై సంవత్సరాలు ఎలా నడిపించారో జ్ఞాపకం చేసుకోండి.
3
మనుష్యులు కేవలం ఆహారం వల్లనే జీవించరు కాని యెహోవా నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు అని మీకు నేర్పించడానికి ఆయన మిమ్మల్ని అణచి మీకు ఆకలి కలిగించి మీకు గాని మీ పూర్వికులకు గాని ఇంతకుముందు తెలియని మన్నాతో మిమ్మల్ని పోషించారు.
4
ఈ నలభై సంవత్సరాలు మీరు వేసుకున్న బట్టలు పాతబడలేదు, మీ కాళ్లు వాయలేదు.
5
ఒకరు తన కుమారుని ఎలా క్రమశిక్షణలో పెడతారో, అలాగే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతారని మీ హృదయంలో మీరు గ్రహించాలి.
6
మీరు మీ దేవుడైన యెహోవాయందు భయం కలిగి, ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన ఆజ్ఞలను పాటించాలి.
Settings