Skip to content
ద్వితీయోపదేశకాండము 30:15-20

జీవాన్ని ఎంచుకొనుడి

ద్వితీయోపదేశకాండము 30:15-20
15
చూడండి, నేను ఈ రోజు జీవాన్ని వృద్ధిని, మరణాన్ని నాశనాన్ని మీ ముందు ఉంచాను.
16
మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలని, ఆయన మార్గంలో నడుచుకోవాలని, ఆయన ఆజ్ఞలు, శాసనాలు, చట్టాలను పాటించాలని నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపిస్తున్నాను; అప్పుడు మీరు జీవిస్తారు, వృద్ధిచెందుతారు, మీరు స్వాధీనం చేసుకోవడానికి ప్రవేశించే దేశంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.
17
కానీ ఒకవేళ మీ హృదయం మారి, మీరు విధేయత చూపకుండ ఇతర దేవుళ్ళకు నమస్కరించి వారిని సేవించడానికి ఆకర్షించబడితే,
18
మీరు ఖచ్చితంగా నాశనం చేయబడతారని నేను ఈ రోజు మీకు ప్రకటిస్తున్నాను. మీరు ప్రవేశించి, స్వాధీనం చేసుకోవడానికి యొర్దాను దాటుతున్న దేశంలో మీరు ఎక్కువకాలం జీవించలేరు.
19
ఈ రోజు నేను మీ ముందు జీవాన్ని మరణాన్ని, దీవెనలు శాపాలను ఉంచి, ఆకాశాలను భూమిని మీకు మీద సాక్షులుగా పిలుస్తాను. ఇప్పుడు జీవాన్ని ఎంచుకోండి, అప్పుడు మీరు, మీ పిల్లలు బ్రతకవచ్చు.
20
మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించేలా, ఆయన స్వరాన్ని విని ఆయనను గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే యెహోవాయే మీ జీవం; మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలో ఆయన మీకు దీర్ఘాయుష్షు ఇస్తారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options