Skip to content
ద్వితీయోపదేశకాండము 27:4-8

ద్వితీయోపదేశకాండము 27:4-8

4
మీరు యొర్దాను దాటినప్పుడు, సున్నం వేసిన ఈ రాళ్లను నేను ఈ రోజు మీకు ఆజ్ఞాపించినట్లు ఏబాలు పర్వతం మీద నిలబెట్టండి.
5
అక్కడ మీ దేవుడైన యెహోవాకు ఒక బలిపీఠం రాళ్లతో కట్టాలి. వాటిపై ఎలాంటి ఇనుప సాధనాన్ని వాడకూడదు.
6
చెక్కని రాళ్లతో యెహోవాకు బలిపీఠం కట్టి దాని మీద దహనబలులు అర్పించాలి.
7
అక్కడ సమాధానబలులు సమర్పించి, వాటిని తింటూ మీ దేవుడైన యెహోవా సన్నిధిలో సంతోషించాలి.
8
మీరు నిలబెట్టిన రాళ్లమీద ఈ ధర్మశాస్త్రంలోని అన్ని మాటలను స్పష్టంగా వ్రాయండి.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options