Skip to content
ద్వితీయోపదేశకాండము 19:14

సరిహద్దు రాళ్లను కాపాడుట

ద్వితీయోపదేశకాండము 19:14
చుట్టుపక్కల సందర్భంతో వచనం 14 చూపబడుతోంది.
11
కాని ఎవరైనా ద్వేషంతో ఎవరి కొరకైనా పొంచి ఉండి, అతని మీద పడి చంపితే అతడా పట్టణాల్లో ఒక దానిలోకి పారిపోయినా ఊరి పెద్దలు అతన్ని బయటకు రప్పించాలి.
12
హంతకుని పట్టణ పెద్దలు పిలిపించి, ప్రతీకారం చేయడానికి వచ్చిన వానికి అతన్ని అప్పగించాలి.
13
జాలి చూపవద్దు. నిర్దోషి రక్తాన్ని చిందించిన అపరాధాన్ని మీరు ఇశ్రాయేలు నుండి ప్రక్షాళన చేయాలి, తద్వారా మీరు బాగుంటారు.
14
మీ దేవుడైన యెహోవా స్వాధీనం చేసుకోమని మీకు ఇవ్వబోతున్న దేశంలో మీరు పొందే వారసత్వంలో మీ పూర్వికులు ఏర్పాటుచేసిన మీ పొరుగువారి సరిహద్దు రాయిని తరలించవద్దు.
15
ఒకడు చేసిన పాపం విషయంలో గాని అపరాధం విషయంలో గాని దాన్ని నిర్ధారించడానికి కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోకూడదు, ఇద్దరు లేదా ముగ్గురు సాక్ష్యాల మీద నేరం నిర్ధారణ చేయాలి.
16
ఒకవేళ కపట బుద్ధి గలవాడు ఎవరిమీదైనా నేరారోపణ చేయడానికే పూనుకుంటే,
17
ఆ వివాదంలో ఉన్న ఇద్దరూ యెహోవా ఎదుట అంటే ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న యాజకుల ఎదుట న్యాయాధిపతుల ఎదుట నిలబడాలి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options