ద్వితీయోపదేశకాండము 18:21-22
21
“ఒక సందేశం యెహోవా మాట్లాడింది కాదు అని మనం ఎలా తెలుసుకోగలము?” అని మీలో మీరు అనుకుంటారు,
22
ఒకవేళ యెహోవా పేరెత్తి ఒక ప్రవక్త ప్రకటించి అది నెరవేరకపోయినా లేదా నిజం కాకపోయినా, అది యెహోవా మాట్లాడింది కాదు. ఆ ప్రవక్త అహంకారంతో మాట్లాడాడు, కాబట్టి భయపడవద్దు.