Skip to content
దానియేలు 10:16-19

సందేశం స్వీకరించుటకు దానియేలు బలపరచబడుట

దానియేలు 10:16-19
16
అప్పుడు మనిషిని పోలిన ఒక వ్యక్తి నా పెదవులు ముట్టాడు, నేను నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించాను. నా ఎదుట నిలుచున్న వ్యక్తితో అన్నాను, “నా ప్రభువా! ఈ దర్శనాన్ని బట్టి నేను వేదన చెందాను, నేను ఎంతో బలహీనంగా అయ్యాను.
17
నా ప్రభువా, మీ దాసుడనైన నేను మీతో ఎలా మాట్లాడగలను? నా బలం పోయింది, కష్టంగా ఊపిరి తీసుకుంటున్నాను.”
18
మనిషిని పోలిన ఆ వ్యక్తి మరలా నన్ను తాకి, నన్ను బలపరిచాడు.
19
“నీవు ఎంతో విలువైనవాడవు, భయపడకు, సమాధానం! ఇప్పుడు ధైర్యం తెచ్చుకో! ధైర్యం తెచ్చుకో!” అని అతడు అన్నాడు. అతడు నాతో మాట్లాడినప్పుడు నేను బలపరచబడ్డాను, “నా ప్రభువా, మీరు నాకు బలం కలిగించారు, కాబట్టి మాట్లాడండి” అని అన్నాను.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options