ఆమోసు 8:1-6
1
ప్రభువైన యెహోవా నాకు చూపించింది ఇదే: పండిన పండ్ల గంప.
2
“ఆమోసూ! నీవేం చూస్తున్నావు?” అని ఆయన అడిగారు. “పండిన పండ్ల గంప” అని నేను జవాబిచ్చాను. అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు, “నా ప్రజలైన ఇశ్రాయేలుకు సమయం దగ్గరపడింది; ఇక నేను వారిని శిక్షించకుండా ఉండను.
3
“ఆ రోజు గుడిలో వారు పాడే పాటలు విలాపంగా మారుతాయి. ఎన్నో శవాలు ఉంటాయి; ఎక్కడ చూసినా అవే! ఊరుకోండి!” అని ప్రభువైన యెహోవా చెప్తున్నారు.
4
అవసరతలో ఉన్నవారిని అణగద్రొక్కే వారలారా, దేశంలో ఉన్న పేదలను అంతం చేసేవారలారా,
5
అలా చేస్తూ, “మనం ధాన్యం అమ్ముకోడానికి, అమావాస్య ఎప్పుడు దాటి పోతుందో, గోధుమ వ్యాపారం సాగటానికి విశ్రాంతి దినం ఎప్పుడు గతించి పోతుందో?” అనుకునేవారలారా వినండి. మీరు కొల గంపలు చిన్నగా చేస్తూ, ధర ఎక్కువ చేస్తూ, దొంగ త్రాసుతో మోసగిస్తారు,
6
బీదలను వెండికి కొంటారు, చెప్పులిచ్చి అవసరతలో ఉన్నవారిని కొంటారు, పాడైపోయి గింజలు కూడా అమ్మివేస్తారు.
Settings