కంటెంట్‌కు వెళ్లండి
అపొస్తలుల కార్యములు 22:6-16

పౌలు తన మారుమనస్సును వివరించుట

అపొస్తలుల కార్యములు 22:6-16
6
“నేను దమస్కు పట్టణానికి సమీపించినప్పుడు, మధ్యాహ్న సమయంలో, అకస్మాత్తుగా పరలోకం నుండి ఒక వెలుగు నా చుట్టూ ప్రకాశించింది.
7
నేను నేల మీద పడి ఒక స్వరం నాతో, ‘సౌలా, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు?’ అనడం విన్నాను.
8
“అందుకు నేను, ‘ప్రభువా, నీవెవరవు?’ అని అడిగాను. “అప్పుడు ఆ స్వరం నాతో, ‘నేను నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసును’ అని జవాబిచ్చాడు.
9
నాతో ఉన్నవారు వెలుగును చూశారు, కాని నాతో మాట్లాడిన స్వరాన్ని గ్రహించలేకపోయారు.
10
“ ‘ప్రభువా, నేను ఏమి చేయాలి?’ అని అడిగాను. “అప్పుడు ‘నీవు లేచి, దమస్కు పట్టణంలోనికి వెళ్లు, అక్కడ నీవు ఏమి చేయాలని నేను నిర్ణయించానో నీకు తెలియజేస్తాను’ అని చెప్పాడు.
11
ప్రకాశమానమైన ఆ వెలుగు నన్ను గ్రుడ్డివానిగా చేసినందుకు, నాతో ఉన్నవారు నా చేతిని పట్టుకుని దమస్కు పట్టణంలోనికి నడిపించారు.
12
“అక్కడ అననీయ అనే ఒక వ్యక్తి నన్ను చూడడానికి వచ్చాడు. అతడు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ యూదులందరి చేత మంచి పేరు పొందిన భక్తిపరుడు.
13
అతడు నా ప్రక్కన నిలబడి, ‘సహోదరుడా సౌలు చూపుపొందుకో!’ అన్నాడు. వెంటనే నేను అతన్ని చూడగలిగాను.
14
“అప్పుడు అతడు, ‘మన పితరుల దేవుడు తన చిత్తాన్ని తెలుసుకోవడానికి, నీతిమంతుని చూడడానికి ఆయన నోటి మాటలను వినడానికి నిన్ను ఎన్నుకున్నాడు.
15
నీవు చూసి వినిన దాని గురించి ప్రజలందరికి చెప్పే సాక్షిగా ఉంటావు.
16
నీవు ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నావు? లేచి, ప్రభువు పేరున ప్రార్థనచేసి, బాప్తిస్మం పొంది నీ పాపాలను కడిగివేసుకో అని చెప్పాడు.’
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options