అపొస్తలుల కార్యములు 21:4-6
4
కాబట్టి మేము అక్కడి శిష్యులను కలిసి వారితో ఏడు రోజులు ఉన్నాము. నీవు యెరూషలేముకు వెళ్లవద్దని ఆత్మ ద్వారా వారు పౌలును బ్రతిమలాడారు.
5
మేము బయలుదేరే సమయం వచ్చినప్పుడు, మేము మా ప్రయాణాన్ని కొనసాగించాము. అప్పుడు వారందరు తమ భార్యా పిల్లలతో కలిసి పట్టణం బయటి వరకు మాతో కూడా వచ్చారు, మేము అందరం సముద్రపు తీరాన మోకరించి ప్రార్థించాము.
6
మేము ఒకరికి ఒకరం వీడ్కోలు చెప్పిన తర్వాత ఓడను ఎక్కాము, వారు తమ ఇళ్ళకు తిరిగి వెళ్లారు.
Settings