కంటెంట్‌కు వెళ్లండి
2 సమూయేలు 18:6-9

2 సమూయేలు 18:6-9

6
దావీదు సైన్యం ఇశ్రాయేలీయులతో పోరాడడానికి యుద్ధ స్థలానికి వెళ్లింది. యుద్ధం ఎఫ్రాయిం అడవిలో జరిగింది.
7
అక్కడ ఇశ్రాయేలీయుల సైన్యం దావీదు సైన్యం చేతిలో ఓడిపోయారు. ఆ రోజు చాలా ఎక్కువగా ప్రాణనష్టం జరిగింది అంటే ఇరవై వేలమంది సైనికులు చంపబడ్డారు.
8
యుద్ధం ఆ ప్రాంతమంతా వ్యాపించింది. ఆ రోజున ఖడ్గం వలన కంటే అడవిలో చిక్కుకుని చనిపోయినవారే ఎక్కువ.
9
అబ్షాలోము కంచరగాడిద ఎక్కి వెళ్తూ దావీదు సైన్యానికి ఎదురయ్యాడు. ఆ కంచరగాడిద గుబురైన కొమ్మలు ఉన్న ఒక సింధూర వృక్షం క్రింది నుండి వెళ్తున్నప్పుడు అబ్షాలోము జుట్టు చెట్టు కొమ్మల్లో చిక్కుకుంది. అయితే ఆ కంచరగాడిద అలాగే ముందుకు వెళ్లిపోవడంతో అతడు గాలిలో వ్రేలాడుతూ ఉండిపోయాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options