2 రాజులు 4:43-44
43
అయితే అతని సేవకుడు, “దీన్ని వందమందికి ఎలా పెట్టగలను?” అని అడిగాడు. అందుకు ఎలీషా, “ ‘వారు తినగా ఇంకా మిగలుతుంది’ అని యెహోవా చెప్పారు కాబట్టి నీవైతే వారికి వడ్డించు” అని అన్నాడు.
44
అప్పుడు అతడు వారికి వడ్డించాడు, యెహోవా చెప్పిన మాట ప్రకారం అందరు తినగా కొంత మిగిలింది.