2 రాజులు 23:4-6
4
రాజు ప్రధాన యాజకుడైన హిల్కీయాను, తర్వాత స్థాయి యాజకులను, ద్వారపాలకులను పిలిపించి బయలుకు, అషేరాకు, నక్షత్ర సమూహాలన్నిటి కోసం చేయబడిన వస్తువులన్నిటిని, యెహోవా మందిరం నుండి తీసివేయాలని ఆదేశించాడు. అతడు వాటిని యెరూషలేము బయట కిద్రోను లోయలో కాల్చివేసి, ఆ బూడిద బేతేలుకు తీసుకెళ్లాడు.
5
అంతకుముందు యూదా పట్టణాల్లో, యెరూషలేము చుట్టూ క్షేత్రాల్లో ధూపం వేయడానికి యూదా రాజులు నియమించిన విగ్రహాల పూజారుల బృందాన్ని అతడు తొలగించాడు. వారు బయలుకు, సూర్యునికి, చంద్రునికి, నక్షత్ర సమూహాలన్నిటికి వేసేవారు.
6
అతడు యెహోవా మందిరం నుండి యెరూషలేము బయట ఉన్న కిద్రోను లోయ దగ్గరకు అషేరా స్తంభాన్ని తెప్పించి, అక్కడ దానిని కాల్చివేశాడు. అతడు దానిని పొడిగా నలుగగొట్టి ఆ పొడిని సాధారణ ప్రజల సమాధుల మీద చల్లాడు.
Settings