Skip to content
2 కొరింథీయులకు 12:14-19

మూడవ రాకడకు ప్రణాళిక

2 కొరింథీయులకు 12:14-19
14
నేను మూడవసారి మీ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నాను, అయితే వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను, ఎందుకంటే నాకు కావల్సింది మీరే తప్ప మీ ధనం కాదు. పిల్లలు తల్లిదండ్రుల కోసం కాదు తల్లిదండ్రులే పిల్లల కోసం పొదుపు చేసి ఉంచాలి.
15
కాబట్టి నాకు కలిగినదంత మీ ఆత్మల కోసం చాలా సంతోషంగా ఖర్చుచేస్తాను, అంతేకాదు నన్ను నేను కూడా మీ కోసం ఖర్చు చేసుకుంటాను; నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించినప్పుడు మీరు నన్ను తక్కువగా ప్రేమిస్తారా?
16
అదలా ఉండనివ్వండి, నేను మీకు భారంగా ఉండలేదు గాని యుక్తిగా మాయ చేసి మిమ్మల్ని పట్టుకున్నాను అని అంటారేమో!
17
నేను మీ దగ్గరకు పంపినవారి ద్వారా మిమ్మల్ని మోసం చేసి ఏమైనా సంపాదించుకున్నానా?
18
తీతును మీ దగ్గరకు వెళ్లమని వేడుకున్నాను. అతనితో పాటు మా సహోదరున్ని కూడ పంపాను. తీతు మిమ్మల్ని దోచుకోలేదు కదా? మేము ఒకే ఆత్మను కలిగి ఒకే అడుగుజాడల్లో నడువలేదా?
19
ఇంతవరకు మేము మీతో మా పక్షంగా వాదించుకుంటున్నామని మీరు అనుకుంటున్నారా? దేవుని దృష్టికి క్రీస్తులో ఉన్న వారిలా మేము మాట్లాడుతున్నాము; మిత్రులారా! మేము చేసే ప్రతిదీ మిమ్మల్ని బలపరచడానికే.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options