Skip to content
2 దినవృత్తాంతములు 3:1-2

2 దినవృత్తాంతములు 3:1-2

1
ఆ తర్వాత సొలొమోను యెరూషలేములో ఉన్న మోరీయా కొండమీద యెహోవా మందిరాన్ని కట్టడం ఆరంభించాడు. అక్కడే యెహోవా సొలొమోను తండ్రియైన దావీదుకు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోను మందిరం కట్టించిన స్థలం అంతకుముందు యెబూసీయుడైన ఒర్నాను నూర్పిడి కళ్ళం ఉంది. దావీదు దానిని సిద్ధం చేశాడు.
2
అతడు తన పాలనలోని నాలుగవ సంవత్సరం రెండవ నెల రెండవ రోజున కట్టడం ప్రారంభించాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options