17
వారు యూదా రాజ్యాన్ని బలపరిచారు; ఈ సమయంలో వారు దావీదు సొలొమోనుల మార్గాలను అనుసరించి మూడు సంవత్సరాలు సొలొమోను కుమారుడైన రెహబాముకు మద్ధతు ఇచ్చారు.
18
రెహబాము దావీదు కుమారుడైన యెరీమోతు కుమార్తెయైన మహలతును పెళ్ళి చేసుకున్నాడు. ఆమె తల్లి యెష్షయి కుమారుడు ఏలీయాబు కుమార్తెయైన అబీహయిలు.