Skip to content
1 సమూయేలు 25:1-3

సమూయేలు మరణించుట; దావీదు దక్షిణానికి వెళ్లుట

1 సమూయేలు 25:1-3
1
కొంతకాలానికి సమూయేలు చనిపోయాడు, ఇశ్రాయేలీయులందరు ఒకచోట చేరి అతని కోసం ఏడ్చారు; రామాలో అతని ఇంటి దగ్గర అతన్ని సమాధి చేసిన తర్వాత దావీదు బయలుదేరి పారాను ఎడారిలోనికి వెళ్లాడు.
2
కర్మెలులో ఆస్తులు ఉన్న ఒక వ్యక్తి మాయోనులో ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు, అతనికి మూడు వేల గొర్రెలు వెయ్యి మేకలు ఉన్నాయి. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్లాడు.
3
అతని పేరు నాబాలు, అతని భార్యపేరు అబీగయీలు. ఆమె చాలా తెలివైనది అందమైనది. అయితే అతడు తన పనులలో చాలా కఠినంగా దుర్మార్గంగా వ్యవహరించేవాడు. అతడు కాలేబు సంతతికి చెందిన వాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options