Skip to content
1 పేతురు 2:4-10

జీవముగల మూలరాయి అయిన క్రీస్తు

1 పేతురు 2:4-10
4
ఉపయోగం లేనిదిగా మనుష్యులచే తిరస్కరించబడిన, అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకోబడిన సజీవ రాయియైన ప్రభువును సమీపించండి.
5
మీరు సజీవమైన రాళ్లవలె ఆత్మీయ మందిరంగా నిర్మించబడుతున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి ప్రీతికరమైన ఆత్మీయ బలులను అర్పించడానికి మీరు పవిత్రమైన యాజకులుగా చేయబడ్డారు.
6
ఎందుకంటే లేఖనాల్లో, “చూడండి, నేను సీయోనులో ఒక రాయిని వేశాను అది ఏర్పరచబడిన అమూల్యమైన మూలరాయి; ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపరచబడరు” అని వ్రాయబడి ఉంది.
7
ఇప్పుడు విశ్వసించేవారికి ఈ రాయి అమూల్యమైనది. కాని విశ్వసించని వారికి, “ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది.”
8
అంతేకాదు, “అది ప్రజలు తడబడేలా చేసే అడ్డురాయి, వారిని పడిపోయేలా చేసే అడ్డుబండ అయ్యింది.” వారిని పడద్రోసేది ఈ రాయే, వారు ఆ వాక్యానికి అవిధేయులు అయినందుకు వారు పతనమయ్యారు. వారిని గురించిన దేవుని సంకల్పం అలాంటిది.
9
కాని మీరైతే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుని మంచితనాన్ని ప్రకటించడానికి ఏర్పరచబడిన ప్రజలుగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని ప్రత్యేకమైన సొత్తుగా ఉన్నారు.
10
ఒకప్పుడు మీరు ప్రజలు కారు కాని ఇప్పుడు మీరు దేవుని ప్రజలు; ఒకప్పుడు మీరు దేవుని కృపను ఎరుగరు కాని ఇప్పుడు మీరు ఆ కృపకు పాత్రులు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options