Skip to content
1 దినవృత్తాంతములు 2:25-41

యెరహ్మెయేలు వంశావళి

1 దినవృత్తాంతములు 2:25-41
25
హెస్రోను మొదటి కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు: మొదటి వాడైన రాము, బూనా, ఓరెను, ఓజెము, అహీయా.
26
యెరహ్మెయేలుకు అటారా అనే మరో భార్య ఉంది. ఆమె ఓనాముకు తల్లి.
27
యెరహ్మెయేలుకు మొదటి కుమారుడైన రాము కుమారులు: మయజు, యామీను, ఏకెరు.
28
ఓనాము కుమారులు: షమ్మయి యాదా. షమ్మయి కుమారులు: నాదాబు, అబీషూరు.
29
అబీషూరు భార్యపేరు అబీహయిలు, ఆమె ద్వారా అతనికి అహ్బాను, మొలీదులు పుట్టారు.
30
నాదాబు కుమారులు: సెలెదు, అప్పయీము. సెలెదు పిల్లలు లేకుండానే చనిపోయాడు.
31
అప్పయీము కుమారుడు: ఇషీ, ఇషీ కుమారుడు షేషాను. షేషాను కుమారుడు అహ్లయి.
32
షమ్మయి సోదరుడైన యాదా కుమారులు: యెతెరు, యోనాతాను. యెతెరు పిల్లలు లేకుండానే చనిపోయాడు.
33
యోనాతాను కుమారులు: పేలెతు, జాజా.
34
షేషానుకు కుమారులు లేరు, కుమార్తెలే ఉన్నారు. షేషానుకు ఈజిప్టు వాడైన యర్హా అనే సేవకుడున్నాడు.
35
షేషాను తన కుమార్తెను తన సేవకుడైన యర్హాకు ఇచ్చి పెళ్ళి చేశాడు. ఆమె ద్వారా అతనికి అత్తయి పుట్టాడు.
36
అత్తయి కుమారుడు నాతాను, నాతాను కుమారుడు జాబాదు,
37
జాబాదు కుమారుడు ఎప్లాలు, ఎప్లాలు కుమారుడు ఓబేదు,
38
ఓబేదు కుమారుడు యెహు, యెహు కుమారుడు అజర్యా,
39
అజర్యా కుమారుడు హేలెస్సు, హేలెస్సు కుమారుడు ఎల్యాశా,
40
ఎల్యాశా కుమారుడు సిస్మాయీ, సిస్మాయీ కుమారుడు షల్లూము,
41
షల్లూము కుమారుడు యెకమ్యా, యెకమ్యా కుమారుడు ఎలీషామా.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.