Skip to content
1 దినవృత్తాంతములు 17:5-8

1 దినవృత్తాంతములు 17:5-8

5
ఈజిప్టు నుండి నేను ఇశ్రాయేలీయులను తీసుకువచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు నేను మందిరంలో నివసించలేదు. ఒక గుడారం నుండి మరో గుడారానికి, ఒక నివాసస్థలం నుండి మరో స్థలానికి మారుతూ వచ్చాను.
6
ఇశ్రాయేలీయులందరితో నేను ఎక్కడికి వెళ్లినా, నా ప్రజలను కాయుమని నేను ఆజ్ఞాపించిన వారి నాయకుల్లో ఎవరితోనైనా, “నా కోసం దేవదారు కర్రలతో మందిరాన్ని ఎందుకు కట్టించలేదు” అని అడిగానా?’
7
“కాబట్టి ఇప్పుడు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: పచ్చిక మైదానంలో గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను తీసుకువచ్చి నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు పాలకునిగా నియమించాను.
8
నీవెక్కడికి వెళ్లినా నేను నీకు తోడుగా ఉండి, నీ ఎదుట నిలబడకుండా నీ శత్రువులందరిని నాశనం చేశాను. ఇప్పుడు భూమి మీద ఉన్న గొప్పవారికున్న పేరులాంటి పేరు నీకు ఇస్తాను.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options