కీర్తనలు128
Listen to this chapter
0:00
0:00
1
యాత్రకీర్తన. యెహోవా పట్ల భయం కలిగి, ఆయన మార్గాలను అనుసరించేవారు ధన్యులు.
2
మీరు మీ కష్టార్జితాన్ని తింటారు; ఆశీర్వాదం అభివృద్ధి మీకు కలుగుతుంది.
3
మీ ఇంట్లో మీ భార్య ఫలించే ద్రాక్షతీగెలా ఉంటుంది; మీ భోజనపు బల్లచుట్టూ మీ పిల్లలు ఒలీవ మొక్కల్లా ఉంటారు.
4
యెహోవా పట్ల భయం కలవారు ఈ విధంగా ఆశీర్వదించబడతారు.
5
సీయోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు; మీ జీవితకాలమంతా యెరూషలేము అభివృద్ధిని చూస్తారు.
6
మీరు మీ పిల్లల పిల్లల్ని చూస్తారు ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక.
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Options
Study Note