కీర్తనలు124
Listen to this chapter
0:00
0:00
1
దావీదు యాత్రకీర్తన. మనుష్యులు మనపై దాడి చేసినప్పుడు వారి కోపం మనపై రగులుకొన్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండకపోతే వారు మనల్ని సజీవంగానే మ్రింగివేసేవారు; వరద మన మీదుగా పొర్లి ఉండేది, జలప్రవాహం మనల్ని ముంచేసి జలప్రవాహాల పొంగు మనల్ని తుడిచిపెట్టి ఉండేది అని ఇశ్రాయేలు చెప్పును గాక.
6
వారి పళ్లు మనల్ని చీల్చివేయటానికి అనుమతించని యెహోవాకు స్తుతి చెల్లును గాక.
7
వేటగాని ఉరి నుండి పక్షి తప్పించుకున్నట్లుగా మనం తప్పించుకున్నాము; ఉరి తెగిపోయింది, మనం తప్పించుకున్నాము.
8
భూమ్యాకాశాలను సృజించిన యెహోవా నామంలోనే మనకు సహాయం లభిస్తుంది.
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Options
Study Note