Skip to content

కీర్తనలు115

దేవుని మహిమ కొరకు వేడుకోలు

1
మాకు కాదు, యెహోవా, మాకు కాదు, మీ మారని ప్రేమ, నమ్మకత్వాన్ని బట్టి, మీ నామానికే మహిమ కలగాలి.
2
“వారి దేవుడు ఎక్కడ?” అని జనులు ఎందుకు అంటున్నారు?
3
మన దేవుడు పరలోకంలో ఉన్నారు; ఆయనకు ఇష్టమైనదే ఆయన చేస్తారు.

విగ్రహాల అసమర్థత

4
అయితే వారి విగ్రహాలు వెండి బంగారాలు, అవి మనుష్యుల చేతిపనులు.
5
వాటికి నోళ్ళున్నాయి, కాని మాట్లాడలేవు, కళ్లున్నాయి, కాని చూడలేవు.
6
వాటికి చెవులున్నాయి, కాని వినలేవు, ముక్కులున్నాయి, కాని వాసన చూడలేవు.
7
వారికి చేతులు ఉన్నాయి, కానీ అనుభూతి చెందవు, పాదాలున్నాయి, కాని నడవలేవు, కనీసం వాటి గొంతులతో శబ్దం చేయలేవు.
8
వాటిని తయారుచేసేవారు, వాటిని నమ్మేవారు వాటి లాగే ఉంటారు.

యెహోవాను నమ్ముమని పిలుపు

9
సర్వ ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకోండి ఆయనే వారికి సహాయం డాలు.
10
అహరోను వంశమా, యెహోవాను నమ్ముకోండి ఆయనే వారికి సహాయం డాలు.
11
యెహోవాకు భయపడు వారలారా ఆయనను నమ్ముకోండి ఆయనే వారికి సహాయం డాలు.

ఆశీర్వాద హామీ మరియు నిరంతర స్తుతి

12
యెహోవా మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటారు మనల్ని దీవిస్తారు: ఆయన ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తారు, అహరోను వంశాన్ని దీవిస్తారు.
13
యెహోవాకు భయపడేవారిని అనగా పిల్లలను పెద్దలను ఆయన దీవిస్తారు.
14
యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను, వృద్ధి చేయును గాక.
15
ఆకాశాన్ని భూమిని సృజించిన యెహోవాచేత, మీరు దీవించబడుదురు గాక.
16
ఎత్తైన ఆకాశాలు యెహోవాకు చెందినవి, అయితే భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చారు.
17
యెహోవాను స్తుతించేది చనిపోయినవారు కాదు, నిశ్శబ్ద ప్రదేశానికి వెళ్లేవారు కాదు;
18
మనమే యెహోవాను కీర్తించేవారం, ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము. యెహోవాను స్తుతించండి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options