Skip to content

కీర్తనలు113

1
యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించండి; యెహోవా నామాన్ని స్తుతించండి.
2
ఇప్పుడు ఎల్లప్పుడు సదా యెహోవా నామం స్తుతింపబడును గాక.
3
సూర్యోదయం నుండి అస్తమించే చోటు వరకు, యెహోవా నామం స్తుతింపబడును గాక.
4
దేశాలన్నిటికి పైగా యెహోవా హెచ్చింపబడ్డారు, ఆయన మహిమ ఆకాశాలకు పైగా విస్తరించి ఉంది.
5
మన దేవుడైన యెహోవా లాంటి వారెవరు, ఎత్తైన సింహాసనంపై ఆసీనులై ఉన్నవారు,
6
అక్కడినుండి ఆకాశాన్ని, భూమిని వంగి చూడగలవారెవరు?
7
దరిద్రులను మట్టిలో నుండి పైకెత్తేది పేదవారిని బూడిద కుప్ప నుండి లేవనెత్తేది ఆయనే;
8
ఆయన వారిని రాకుమారులతో, తన ప్రజల రాకుమారులతో కూర్చోబెడతారు.
9
అతడు సంతానం లేని స్త్రీని తన ఇంట్లో సంతోషంగా ఉన్న తల్లిగా స్థిరపరుస్తారు. యెహోవాను స్తుతించండి.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options