Frankincense గురించి బైబిల్ వచనాలు: Used with meat offerings
Used with meat offerings గురించి వచనాలు
“ ‘ఎవరైనా యెహోవాకు భోజనార్పణ తెచ్చినప్పుడు, అది నాణ్యమైన పిండితో చేసినదై ఉండాలి. వారు దాని మీద ఒలీవనూనె పోసి, దానిపై ధూపం వేసి,
దానిని యాజకులైన అహరోను కుమారుల దగ్గరకు తీసుకురావాలి. యాజకుడు ఒక పిడికెడు పిండి, నూనె, ధూపమంతటితో పాటు తీసుకుని బలిపీఠం మీద దానిని ఒక జ్ఞాపకార్థ భాగంగా, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలిగా దహించాలి.
దాని మీద నూనె పోయాలి, ధూపం వేయాలి; అది భోజనార్పణ.
యాజకుడు జ్ఞాపకార్థ భాగమైన నలుగగొట్టిన ధాన్యాన్ని, నూనెను, ధూపంతో కలిపి యెహోవాకు హోమబలిగా దహించాలి.