Firmament గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
దేవుడు, “ఆకాశ జలాలను భూ జలాలను వేరు చేయడానికి జలాల మధ్య విశాలం కలుగును గాక” అన్నారు.
అలాగే జరిగింది. దేవుడు విశాలాన్ని చేసి ఆ విశాలం క్రింది జలాలను విశాలం మీది జలాలను వేరుచేశారు.
దేవుడు ఆ విశాలానికి “ఆకాశం” అని పేరు పెట్టారు. సాయంకాలం గడిచి ఉదయం వచ్చింది. అది రెండవ రోజు.
దేవుడు, “పగలు రాత్రులను వేరు చేయడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుండాలి, అవి రుతువులను రోజులను సంవత్సరాలను సూచించే అసాధారణ గుర్తులుగా ఉండాలి.
ఆకాశ విశాలంలో భూమికి వెలుగునిచ్చే జ్యోతులుండును గాక” అని అన్నారు, అలాగే జరిగింది.
దేవుడు పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని అలా రెండు గొప్ప జ్యోతులను అలాగే నక్షత్రాలను కూడా చేశారు.
భూమికి వెలుగునివ్వడానికి, పగటిని రాత్రిని పాలించడానికి, చీకటిని వెలుగును వేరు చేయడానికి, దేవుడు వాటిని ఆకాశ విశాలంలో అమర్చారు. అది మంచిదని దేవుడు చూశారు.