కంటెంట్‌కు వెళ్లండి

Creation గురించి బైబిల్ వచనాలు: Third day, separating the land from the water, and making it fruitful

5 వచనాలు · 35 కోణాలు

Third day, separating the land from the water, and making it fruitful గురించి వచనాలు

  1. దేవుడు, “ఆకాశం క్రింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడును గాక” అని అనగా అలాగే జరిగింది.

  2. దేవుడు ఆరిన నేలకు “భూమి” అని, ఒకే చోట సమకూడిన జలాలకు “సముద్రం” అని పేరు పెట్టారు. అది మంచిదని దేవుడు చూశారు.

  3. అప్పుడు దేవుడు, “భూమి వృక్ష సంపదను అనగా విత్తనాలు ఉత్పత్తి చేసే మొక్కలు, వాటి వాటి జాతుల ప్రకారం విత్తనాలతో ఉన్న ఫలమిచ్చే చెట్లను భూమి మొలిపించును గాక” అని అన్నారు. అలాగే జరిగింది.

  4. భూమి వృక్ష సంపదను ఉత్పత్తి చేసింది అంటే, వాటి వాటి జాతుల ప్రకారం విత్తనాలు గల మొక్కలు, వాటి వాటి జాతుల ప్రకారం విత్తనాలతో ఉన్న ఫలమిచ్చే చెట్లు మొలిపించింది. అది మంచిదని దేవుడు చూశారు.

  5. సాయంకాలం గడిచి ఉదయం రాగా అది మూడవ రోజు.