కంటెంట్‌కు వెళ్లండి

Anointing Oil గురించి బైబిల్ వచనాలు

7 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

  1. తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నారు:

  2. “నీవు ఈ శ్రేష్ఠమైన సుగంధద్రవ్యాలు తీసుకోవాలి: పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం గోపరసం 500 షెకెళ్ళు, వాసనగల దాల్చిన చెక్క సగం అనగా 250 షెకెళ్ళు, పరిమళ వాసనగల నిమ్మగడ్డి నూనె 250 షెకెళ్ళు

  3. లవంగపట్ట 500 షెకెళ్ళు, అయిదు శేర్ల ఒలీవనూనె; అన్నీ పరిశుద్ధాలయం యొక్క షెకెల్ ప్రకారం తీసుకోవాలి.

  4. వాటిని పవిత్ర అభిషేక తైలంగా, పరిమళద్రవ్యాలు చేసేవాని పనిలా పరిమళ మిశ్రమం చేయాలి. అది పవిత్ర అభిషేక తైలం అవుతుంది.

  5. నీవు ఇశ్రాయేలీయులతో, ‘ఇది రాబోయే తరాలకు పవిత్రమైన అభిషేక తైలం అవుతుంది.

  6. దానిని సాధారణ మనుష్యుల శరీరంపై పోయకూడదు, ఆ సూత్రాన్ని ఉపయోగించి మరే ఇతర నూనెను తయారుచేయవద్దు. ఇది పవిత్రమైనది, మీరు దానిని పవిత్రంగా పరిగణించాలి.

  7. దాన్ని పోలిన పరిమళద్రవ్యాన్ని తయారుచేసినవారు, యాజకుల మీద కాకుండా ఇతరుల మీద దానిని పోసిన వారు తమ ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి’ అని చెప్పు.”