కీర్తనలు 91:5-10
5
రాత్రి భయాలకు గాని, పగటి పూట ఎగిరి వచ్చే బాణాలకు గాని,
6
చీకటిలో సంచరించే తెగులుకు గాని, మధ్యహ్నం హఠాత్తుగా కలిగే నాశనానికి గాని, నీవు భయపడాల్సిన అవసరం లేదు.
7
నీ ప్రక్కన వేయిమంది, నీ కుడి ప్రక్కన పదివేలమంది కూలవచ్చు, అయినా, అది నీ దగ్గరకు రాదు.
8
నీవు నీ కళ్లతో గమనిస్తావు దుష్టులు శిక్ష పొందడం నీవు చూస్తావు.
9
“యెహోవా నాకు ఆశ్రయం” అని ఒకవేళ నీవు అని, మహోన్నతుని నీకు నివాసంగా చేసుకుంటే,
10
ఏ హాని నీ మీదికి రాదు, ఏ తెగులు నీ గుడారానికి దగ్గరగా రాదు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings