Skip to content
కీర్తనలు 84:8-12

కృప మరియు నమ్మకం కొరకు ప్రార్థన

కీర్తనలు 84:8-12
8
సైన్యాల యెహోవా దేవా, నా ప్రార్థన వినండి; యాకోబు దేవా, ఆలకించండి. సెలా
9
మా డాలువైన ఓ దేవా! మా వైపు చూడండి; మీ అభిషిక్తునిపై దయ చూపండి.
10
బయట గడిపిన వెయ్యి దినాలకంటే మీ మందిరంలో ఒక్కరోజు గడపడం మేలు. దుష్టుల గుడారాల్లో నివసించడం కంటే నేను నా దేవుని మందిరంలో ఒక ద్వారపాలకునిగా ఉండడం నాకిష్టము.
11
యెహోవా దేవుడు మాకు సూర్యుడు డాలు; యెహోవా దయను ఘనతను అనుగ్రహిస్తారు; నిందారహితులుగా నడుచుకునే వారికి ఆయన ఏ మేలు చేయకుండ మానరు.
12
సైన్యాల యెహోవా, మీయందు నమ్మకముంచే మనుష్యులు ధన్యులు.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.