కీర్తనలు 74:1-2
1
ఆసాపు ధ్యానకీర్తన. దేవా, మమ్మల్ని శాశ్వతంగా ఎందుకు తిరస్కరించారు? మీ పచ్చికలోని గొర్రెల మీద మీ కోపం ఎందుకు రగులుకొంది?
2
మీ స్వాస్థ్య గోత్రాన్ని మీరు పూర్వం సంపాదించుకుని విమోచించిన మీ వారసత్వ సమాజాన్ని, మీరు నివసించిన సీయోను పర్వతాన్ని జ్ఞాపకం చేసుకోండి.