కీర్తనలు 71:2-4
2
మీ నీతిని బట్టి నన్ను రక్షించి విడిపించండి; నా వైపు చెవి ఉంచి నన్ను రక్షించండి.
3
నేను ఎల్లప్పుడూ వెళ్లగలిగే, నా ఆశ్రయదుర్గంగా ఉండండి; మీరు నా కొండ నా కోట కాబట్టి, నన్ను రక్షించేందుకు ఆజ్ఞ ఇవ్వండి.
4
నా దేవా, దుష్టుల చేతి నుండి, చెడ్డవారు, క్రూరుల పట్టు నుండి నన్ను విడిపించండి.