Skip to content
కీర్తనలు 65:9-13

దేవుడు భూమికి, పంటకు సమృద్ధిని అనుగ్రహించును

కీర్తనలు 65:9-13
9
మీరు భూమిని గమనించి నీరు పోస్తారు; మీరు దానిని సమృద్ధిగా సుసంపన్నం చేస్తారు. ప్రజలకు ధాన్యాన్ని అందించడానికి దేవుని ప్రవాహాలు నీటితో నిండి ఉన్నాయి ఎందుకంటే దానిని మీరు అలా నియమించారు.
10
మీరు దున్నిన భూమిని వర్షంతో తడిపి, గడ్డలను కరిగించి, గట్లు సమం చేస్తారు. మీరు వానజల్లులతో భూమిని మృదువుగా చేసి, దాని పంటలను ఆశీర్వదిస్తారు.
11
మీరు మీ దయతో సంవత్సరానికి కిరీటం ధరింపచేస్తారు, మార్గాలు కూడ సమృద్ధితో పొంగిపోతాయి.
12
అరణ్యం యొక్క తుక్కు భూములు పొంగిపొర్లుతాయి; కొండలు ఆనందాన్ని ధరించుకొని ఉన్నాయి.
13
పచ్చికబయళ్లు మందల చేత కప్పబడ్డాయి లోయలు ధాన్యంతో కప్పబడి ఉన్నాయి; వారు ఆనందంతో కేక వేస్తూ పాడతారు.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.