కీర్తనలు 62:3-5
3
ఎంతకాలం మీరు ఒక్కడి మీద దాడి చేస్తారు? వాలుతున్న గోడను, పడిపోతున్న కంచెను పడద్రోసినట్లు మీరంతా నన్ను పడద్రోస్తారు?
4
ఖచ్చితంగా వారు నన్ను నా ఉన్నత స్థానం నుండి పడగొట్టాలని నిర్ణయించారు; వారు అబద్ధాలు చెప్పడంలో ఆనందిస్తారు. వారు నోటితో దీవిస్తారు, కాని వారి హృదయాల్లో శపిస్తారు. సెలా
5
అవును, నా ఆత్మ దేవునిలోనే విశ్రాంతి పొందుతుంది; ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతుంది.
Settings