కీర్తనలు 36:5-9
5
యెహోవా! మీ మారని ప్రేమ ఆకాశాన్ని మీ విశ్వాస్యత అంతరిక్షాన్ని తాకుతుంది.
6
మీ నీతి దేవుని ఉన్నత పర్వతాల్లా, మీ న్యాయం అగాధ సముద్రంలా ఉన్నాయి. యెహోవా! మీరు మనుష్యులను జంతువులను సంరక్షిస్తున్నారు.
7
దేవా! మీ మారని ప్రేమ ఎంత అమూల్యమైనది! నరులు మీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు.
8
మీ మందిరంలోని సమృద్ధి వల్ల వారు సంతృప్తి పొందుతున్నారు; మీ ఆనంద నది నుండి మీరు వారికి త్రాగడానికి ఇస్తారు.
9
ఎందుకంటే మీ దగ్గర జీవపుఊట ఉంది; మీ వెలుగులోనే మేము వెలుగును చూడగలము.
Settings