కీర్తనలు 35:9-10
9
నా ప్రాణం యెహోవాలో ఆనందిస్తుంది ఆయన రక్షణలో సంతోషిస్తుంది.
10
“యెహోవా, నిన్ను పోలినవారెవరు? బలవంతుల చేతిలో నుండి మీరు బాధితులను విడిపిస్తారు, దోపిడి దొంగల నుండి మీరు దీనులను నిరుపేదలను విడిపిస్తారు” అని నా శక్తి అంతటితో నేను అంటాను.