కీర్తనలు 22:12-16
12
ఎన్నో ఎద్దులు నన్ను చుట్టుముట్టాయి; బాషాను బలమైన ఎద్దులు నన్ను చుట్టూ మూగాయి.
13
గర్జిస్తూ ఎరను చీల్చే సింహాల్లా వారు తమ నోరు పెద్దగా తెరిచారు.
14
నేను నీటిలా పారబోయబడ్డాను, నా ఎముకలు కీళ్ళ నుండి తప్పాయి. నా హృదయం మైనంలా; నాలో కరిగిపోయింది.
15
నా బలం ఎండిన కుండపెంకులా అయింది, నా నాలుక నా అంగిలికి అంటుకుపోయింది; మీరు నన్ను మరణ ధూళిలో పడవేశారు.
16
కుక్కలు నా చుట్టూ గుమికూడాయి, దుష్టుల మూక నా చుట్టూ మూగింది; వారు నా చేతుల్లో నా పాదాల్లో పొడిచారు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.