కీర్తనలు 17:13-14
13
యెహోవా, లెండి, వారిని ఎదిరించండి, వారిని కూలద్రోయండి; మీ ఖడ్గంతో దుష్టుల నుండి నన్ను విడిపించండి.
14
ఈ జీవితకాలంలో మాత్రమే సంపదలు ఉన్న ఈ లోకసంబంధుల నుండి యెహోవా, మీ చేతితో నన్ను రక్షించండి. మీరు దుష్టుల కొరకు దాచిన దానితో వారి కడుపులను నింపుతారు; వారి పిల్లలు దానితో సంతృప్తి చెందుతారు, మిగిలిన దానిని తమ పిల్లలకు విడిచిపెడతారు.
Settings