కీర్తనలు 147:1-9
1
యెహోవాను స్తుతించండి, మన దేవుని స్తుతించడం ఎంత మంచిది, ఆయనను స్తుతించడం ఎంత మనోహరమైనది, తగినది!
2
యెహోవా యెరూషలేమును కట్టిస్తారు; ఇశ్రాయేలు వారిలో నుండి చెరగొనిపోబడిన వారిని ఆయన సమకూరుస్తారు.
3
విరిగిన హృదయం గలవారిని బాగుచేస్తారు. వారి గాయాలను నయం చేస్తారు.
4
ఆయన నక్షత్రాలను లెక్కిస్తారు, సమస్తాన్ని పేరు పెట్టి పిలుస్తారు.
5
మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి కలవాడు; ఆయన గ్రహింపుకు పరిమితి లేదు.
6
యెహోవా దీనులను ఆదరిస్తారు కాని దుష్టులను నేలమట్టం చేస్తారు.
7
యెహోవాకు కృతజ్ఞత స్తుతులు పాడండి; సితారా మీటి దేవునికి స్తుతులు పాడండి.
8
ఆయన ఆకాశాన్ని మేఘాలతో కప్పుతారు; భూమికి వర్షమిచ్చి కొండలపై గడ్డి మొలిపిస్తారు.
9
ఆయన పశువులకు కూసే కాకులకు ఆహారం సమకూరుస్తారు.
Settings