5
యెహోవా గొప్పవాడని, దేవుళ్ళందరికంటే మన ప్రభువు గొప్పవాడని నాకు తెలుసు.
6
ఆకాశాల్లో భూమిమీద, సముద్రాల్లో జలాగాధాలలో, యెహోవా తనకిష్టమైన దానిని జరిగిస్తారు.
7
ఆయన భూమి అంచుల నుండి మేఘాలను లేచేలా చేస్తారు; వర్షంతో పాటు మెరుపులను పంపిస్తారు తన కోటలో నుండి గాలిని బయటకు పంపిస్తారు.