Skip to content
కీర్తనలు 119:89-95

కీర్తనలు 119:89-95

89
యెహోవా! మీ వాక్కు శాశ్వతం; అది పరలోకంలో సుస్థిరంగా ఉంది.
90
మీ నమ్మకత్వం తరతరాలకు నిలుస్తుంది. మీరు భూమిని స్థాపించారు, అది సుస్థిరంగా ఉంటుంది.
91
మీ న్యాయవిధులు ఈ రోజు వరకు కొనసాగుతాయి, ఎందుకంటే అన్ని మీకు సేవ చేస్తాయి.
92
ఒకవేళ మీ ధర్మశాస్త్రం నా ఆనందమై ఉండకపోతే, నేను బాధలో నశించి పోయి ఉండేవాన్ని.
93
నేను మీ కట్టడలు ఎన్నడు మరువను, ఎందుకంటే వాటి ద్వార మీరు నా జీవితాన్ని కాపాడారు.
94
నేను మీ వాడను, నన్ను రక్షించండి; నేను మీ కట్టడలను వెదికాను.
95
దుష్టులు నన్ను చంపాలని కాచుకుని ఉన్నారు, కాని నేనైతే మీ శాసనాలను గురించి ఆలోచిస్తాను.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.