కీర్తనలు 119:65-72
65
యెహోవా, మీ మాట ప్రకారం మీ సేవకునికి మేలు చేయండి.
66
నేను మీ ఆజ్ఞలను నమ్ముకున్నాను, నాకు సరియైన వివేచనను గ్రహింపును బోధించండి.
67
నాకు బాధ కలుగకముందు నేను త్రోవ తప్పి తిరిగాను, కాని ఇప్పుడు నేను మీ వాక్కుకు లోబడుతున్నాను.
68
మీరు మంచివారు, మీరు మంచి చేస్తారు; మీ శాసనాలు నాకు బోధించండి.
69
అహంకారులు నన్ను అబద్ధాలతో అరిచినప్పటికీ, నేను హృదయపూర్వకంగా మీ కట్టడలను అనుసరిస్తాను.
70
వారి హృదయాలు క్రొవ్వులా మందగించాయి, కాని నేను మీ ధర్మశాస్త్రంలోనే ఆనందిస్తాను.
71
నాకు బాధ కలగడం మేలైంది తద్వారా నేను మీ శాసనాలు నేర్చుకోగలను.
72
వేలాది వెండి బంగారు నాణేలకంటే మీ నోట నుండి వచ్చిన ధర్మశాస్త్రం నాకు అమూల్యమైనది.
Settings