Skip to content
కీర్తనలు 106:7-12

కీర్తనలు 106:7-12

7
మా పూర్వికులు ఈజిప్టులో ఉన్నప్పుడు నేను చేసిన అద్భుతాలను గ్రహించలేదు; మీ దయాసమృద్ధిని వారు తలపోయ లేదు, ఎర్ర సముద్రం దగ్గర తిరుగుబాటు చేశారు.
8
అయినా ఆయన తన బలప్రభావాలను తెలియపరచడానికి, తన పేరు కోసం వారిని రక్షించాడు.
9
ఎర్ర సముద్రాన్ని గద్దించాడు. అది ఎండిపోయింది; ఎడారిలో నడిచినట్లే జలాగాధంలో వారు నడిచారు. దేవుడు వారిని నడిపించాడు.
10
పగవారి బారి నుండి దేవుడే వారిని తప్పించాడు; విడుదల ప్రసాదించాడు.
11
విరోధులంతా నీటిలో మునిగి చచ్చారు. ఒక్కడూ మిగల్లేదు.
12
ఇశ్రాయేలీయులు అప్పుడు కాని దేవుని మాట నమ్మలేదు. స్తుతిస్తూ పాటలు పాడారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options