Skip to content
సామెతలు 8:1-11

సామెతలు 8:1-11

1
జ్ఞానం ప్రకటించడం లేదా? తెలివి దాని స్వరమును ఎత్తడం లేదా?
2
కొండ శిఖరాల మీదను, మార్గము ప్రక్కగా, దారులు కలిసే చోట ఆమె నిలువబడి ఉన్నది;
3
పట్టణంలోకి వెళ్లే గుమ్మముల ప్రక్కన, ప్రవేశం దగ్గర, జ్ఞానం నిలువబడి, ఇలా కేకలు వేస్తుంది:
4
మనుష్యులారా, మిమ్మల్నే నేను పిలుస్తున్నాను; మనుష్యులందరికి నా కంఠస్వరం వినిపిస్తున్నాను.
5
అజ్ఞానులారా, వివేకాన్ని సంపాదించుకోండి, మూర్ఖులారా; వివేకంపై మనస్సు పెట్టండి.
6
వినండి, నేను ఎంతో మంచి సంగతులను చెప్తున్నాను; నా పెదవులు న్యాయాన్ని మాత్రమే పలుకుతాయి.
7
నా నోరు సత్యం మాట్లాడుతుంది, నా పెదవులు దుష్టత్వాన్ని అసహ్యిస్తాయి.
8
నా నోటి మాటలన్నీ న్యాయమైనవి; వాటిలో క్రూరత్వం గాని అబద్ధం గాని లేవు.
9
నా మాటలు వివేచనగలవానికి యథార్థమైనవిగా; జ్ఞానవంతునికి తేటగా ఉంటాయి.
10
వెండికి ఆశపడక నేను చెప్పు మాటలను అంగీకరించండి, మేలిమి బంగారానికి ఆశపడక తెలివిని సంపాదించండి.
11
జ్ఞానం, ముత్యాల కంటే శ్రేష్ఠమైనది, విలువగల వస్తువులు ఏమియు దానితో సరికావు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options