సామెతలు 7:14-20
14
“నేడు నేను నా మ్రొక్కుబడులు చెల్లించాను, ఇంటి దగ్గర నా సమాధానబలి అర్పణలోని ఆహారం ఉంది.
15
కాబట్టి నేను నిన్ను కలుసుకోవాలని వచ్చాను; నిన్ను వెదుకుతూ బయలుదేరగా నీవే కనబడ్డావు!
16
నా మంచం మీద ఈజిప్టు నుండి తెచ్చిన రంగుల నార దుప్పట్లు పరిచాను.
17
నా పరుపు మీద నేను మంచి సువాసనగల గోపరసం, అగరు, దాల్చిన చెక్కను చల్లాను.
18
తెల్లవారే వరకు వలపు తీర తృప్తి పొందుదాం; మనం హాయిగా అనుభవించుదాం!
19
నా భర్త ఇంట్లో లేడు; దూర ప్రయాణం వెళ్లాడు.
20
అతడు దూర ప్రయాణానికి సరిపడేంత డబ్బు సంచి చేతిలో పట్టుకుని వెళ్లాడు. రెండు వారాల వరకు తిరిగి రాడు.”
Settings