సామెతలు 4:23-27
23
అన్నిటికి మించి, నీ హృదయాన్ని కాపాడుకో, ఎందుకంటే నీ హృదయంలోనుండి జీవన వనరులు ప్రవహిస్తాయి.
24
నీ నోటిని వక్రబుద్ధికి దూరంగా ఉంచుకో; మోసపూరితమైన మాటలు నీ పెదాలకు దూరంగా ఉంచుకో.
25
నీ కళ్లు నేరుగా చూచును గాక; నీ చూపు నేరుగా నీ ముందు ఉండును గాక.
26
నీ పాదాలకు తిన్నని మార్గాన్ని ఏర్పరచుకో నీ మార్గాలన్ని స్థిరంగా ఉంటాయి.
27
నీవు కుడివైపుకైనా, ఎడమవైపుకైనా తిరుగవద్దు. నీ పాదాలను కీడుకు దూరంగా ఉంచాలి.
Settings